హైదరాబాద్: 28°C
వార్తలు

దేశంలో సరిపడా బొగ్గు నిల్వలు: కేంద్ర మంత్రి

ప్రస్తుతం దేశంలో ఎలాంటి బొగ్గు కొరత లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 123 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇది దేశానికి దాదాపు 51 రోజులకు సరిపోతాయని చెప్పారు. అలాగే విద్యుత్ ప్లాంట్లు, ఉత్పత్తి కంపెనీల వద్ద కూడా సుమారు 23 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు.