హైదరాబాద్: 28°C
వార్తలు

మెటా ఇండియాకు నోటీసులు

మెటా ఇండియాకు NCPCR నోటీసులు జారీ చేసింది. బాలాల లైంగిక వేధింపులు, దుర్వినియోగ పదార్థాలకు సంబంధించిన ప్రకటనలు ప్రసారం అవుతున్నాయని బీబీసీ ఐ ప్రచురించిన కథనంపై NCPCR సుమోటోగా కేసు నమోదు చేసుకుంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని మెటాను కోరింది. రేపు తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.