హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌ లాజిస్టిక్స్‌ వ్యయం 7 శాతానికి: ఫడ్నవీస్

భారత్‌ లాజిస్టిక్స్‌ వ్యయం తగ్గిందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఇప్పటికే 14 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని వెల్లడించారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తి అయిన తర్వాత 7 శాతానికి తగ్గుతుందని చెప్పారు. దీంతో ప్రపంచ సరఫరా గొలుసులో చైనా సరసన భారత్‌ చేరుతుందన్నారు. అతి త్వరలోనే చైనాను కూడా దాటే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.