హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతిభావంతులకు పరికరాలు పంపిణీ

విజయనగరం ఆర్‌సీఎం బోర్డింగ్ హాల్ వద్ద మంగళవారం ప్రత్యేక ప్రతిభావంతులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. చాయ్ హోలీ స్పిరిట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ చంద్రకళ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక ప్రతిభావంతుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.