హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ కార్యక్రమం వేళ.. తుపాకీ కలకలం!

ముంబైలో ప్రధాని మోదీ హాజరుకానున్న కార్యక్రమంలో భద్రతాపరమైన లోపాలు బయటపడ్డాయి. వేదిక వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి నకిలీ PMO ID కార్డులు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని రోహన్, అతడి బాడీగార్డ్‌గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు. విషయం తీవ్రత దృష్ట్యా ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది.