ASR: అరకులోయ మండలం పరిధి బస్కి గ్రామ సచివాలయంలో వైస్ ఎంపీపీ కిలో రామన్న ఆధ్వర్యంలో రైతులకు రాజ్మా చిక్కుడు విత్తనాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గిరిజన రైతుల సాంప్రదాయ పంటలతో పాటు రాజ్మా వంటి లాభదాయకమైన పంటలను సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అలాగే, రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు రాజ్మా విత్తనాలు పంపిణీ
