హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు రోజుల పాటు వర్షాలు..!

VZM: వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 11 నాటికి అల్పపీడనం కేంద్రీకృతమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కావున, సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు తీరం వెంబడి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.