హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయాల్లో పెన్షన్ల ప్రక్రియ తనిఖీ

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని పలు సచివాలయ కేంద్రాలను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మంగళవారం సందర్శించారు. నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మంజూరు, పంపిణీ తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో పెన్షన్లు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.