నెల్లూరు: మర్రిపాడు మండలం డిసిపల్లి గ్రామంలో ఉరి వేసుకుని వివాహిత మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వింజమూరు మండలానికి చెందిన షేక్ హనీకి రెండేళ్ల క్రితం షేక్ చాన్ భాషాతో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. భర్త చెడు అలవాట్లపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
