బీహార్ సమస్తిపూర్ జంక్షన్‌లో ఏసీ ఫస్ట్ క్లాస్ రైలుబోగీలో విదేశీ మద్యం దొరకటం కలకలం రేపింది. సుమారు 75 లీటర్ల విదేశీ మద్యంతో ప్రయాణిస్తున్న 25 ఏళ్ల నేహా జానును పోలీసులు అరెస్టు చేశారు. ఈ విదేశీ మద్యం విలువ సుమారు 1.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తమ ఇంట్లో పెళ్లి వేడుక ఉన్నందున హర్యానా నుంచి మద్యాన్ని తీసుకొస్తున్నట్లు ఆమె చెప్పారు.
వార్తలు
బోగీలో 75 లీటర్ల విదేశీ మద్యం.. మహిళ అరెస్ట్


