నెల్లూరు: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈనెల 18న గణేష్ ఘాట్, పెన్నా బ్రిడ్జి వద్ద నిమజ్జనానికి క్రేన్లు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్
