ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి భేటీ కానున్నారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా ఈ నెల 11న ఇరు నేతలు సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ఈ భేటీలో ఇరు దేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గల్ఫ్ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంశాలపై మాట్లాడనున్నారు.
వార్తలు
మరోసారి భేటీకానున్న మోదీ, పుతిన్


