పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ఎంపీ నదీముల్లా హక్ పత్రికలో రూ.60 కోట్ల మేరకు అవకతవకలు జరిగినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్ ఆరోపణల కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీకి సంబంధించిన ప్రాంగణాల్లో 24 గంటల పాటు అధికారులు సోదాలు చేశారు. మరోవైపు ఈ చర్యలను టీఎంసీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి దాడులు చేయిస్తోందని విమర్శించారు.
వార్తలు
ఎంపీ పత్రికలో రూ.60 కోట్ల అవకతవకలు


