PLD: చిలకలూరిపేట (మం)లోని విజయ బ్యాంకు సర్వీస్ రోడ్డులో భారీ ఇసుక లారీ కుంతలో కూరుకుపోయింది. మున్సిపల్ వాటర్ పైప్‌లైన్ మరమ్మతుల కోసం గతంలో తవ్విన ప్రాంతాన్ని ఇటీవల పూడ్చారు. అయితే మట్టి పూర్తిగా గట్టిపడకముందే అటుగా వెళ్లిన ఇసుక లారీ బరువుకు రోడ్డు కుంగిపోవడంతో లారీ వెనుక భాగం పూర్తిగా కుంతలోకి దిగిపోయింది. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కుంతలో కూరుకుపోయిన భారీ ఇసుక లారీ


