హైదరాబాద్: 28°C
వార్తలు

కేసీఆర్ చావు కోరుకుంటున్నాం: ఎమ్మెల్యే

TG: మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ MLA వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇంటి వద్ద నిరసనకు వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చావు ఎందుకు కోరుకుంటున్నారని విలేకరి అడగగా.. 'ఆయన ఈ రాష్ట్రానికి పట్టిన పీడ' అని ఆయన బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో శంకర్ వ్యాఖ్యలపై BRS శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.