హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఎయిరిండియాతో 20 ఏళ్ల క్రితమే అనుబంధం’

ఎయిరిండియాను తిరిగి అగ్రస్థానంలోకి తీసుకొచ్చే అవకాశం రావడం సంతోషంగా ఉందని నూతన సీఈఓ టెవోల్డే గెబ్రెమరియం అన్నారు. 20 ఏళ్ల క్రితం ముంబైలో పనిచేస్తున్నప్పుడు ఎయిరిండియాతో ఉన్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. సంస్థకు భద్రత అనేది అత్యంత ప్రాధాన్యాంశం కావాలని, ఏవైనా ఆందోళనలు ఉంటే స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు ఉద్యోగులకు పూర్తి అవకాశం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.