హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచలంలో సహస్రనామార్చన

VSP: సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో మంగళవారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి ఆగమశాస్త్ర విధానంలో ఈ పూజను కమనీయంగా జరిపించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.