తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు సమీపంలో రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్, యాసిడ్ డ్రమ్ములను వదిలేసి వెళ్లారు. వాటిలోని రసాయనాల కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. విపరీతమైన దుర్వాసన, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్
దివాన్‌చెరువులో భారీగా మంటలు


