హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దనాన్నపై కత్తితో దాడి

VZM: గంట్యాడ మండలం మధుపాడ గ్రామానికి చెందిన దారపు రెడ్డి విజయ్‌కుమార్ మద్యానికి బానిసయ్యాడు. విశాఖలో ఉంటున్న ఆయన అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులను వేధిస్తుండగా పెద్దనాన్న దారపు రెడ్డి కృష్ణ మందలించడంతో ఆగ్రహించిన విజయ్‌కుమార్ కత్తితో దాడి చేసినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.