VSP: భీమిలి పరిధిలోని యాతపేట రాజుల తాళ్ళవలసకు చెందిన డిగ్రీ విద్యార్థిని మైనపు లావణ్య 20 అదృశ్యమైంది. ఈ నెల 5న ఉదయం కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఆచూకీ లభించకపోవడంతో తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై జామి సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి వివరాలు తెలిస్తే భీమునిపట్నం పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని హెచ్సీ అమర్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
భీమిలిలో డిగ్రీ విద్యార్థిని అదృశ్యం


