BDK: టేకులపల్లి మండలం పెగల్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని తూర్పుగూడెం గ్రామంలో రూ. 35 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు MLA కోరం కనకయ్య శంకుస్థాపన చేశారు. గ్రామ మహిళలు ఎమ్మెల్యేకు హారతులతో ఘన స్వాగతం పలికారు. రోడ్డు పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని కోరారు.
తెలంగాణ
CC రోడ్డు నిర్మాణానికి MLA కోరం శంకుస్థాపన


