హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తిలో వీధి కుక్కల పట్టివేత

ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలో కుక్కల నియంత్రణకు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చర్యలు చేపట్టారు. తమిళనాడు నుంచి మనుషులను పిలిపించి కుమ్మర వీధి, అమృత్ సినిమా థియేటర్, ఎస్సీ కాలనీ, తదితర ప్రాంతాల్లో కుక్కలను పట్టి తరలించారు. ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రంలోని వాక్సినేషన్ కేంద్రానికి తరలించారు.