హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అమ్మపై దాడి చేశారనే ఆత్మహత్యాయత్నం

MDK: రామాయంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో పెయింటర్‌ దుర్గాప్రసాద్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం రేపింది. ఈ ఘటనలో బాధితుడి వాంగ్మూలం తీవ్ర కలకలం రేపుతోంది. యువతి కుటుంబసభ్యులు ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి తన తల్లిని ఈడ్చుకొచ్చి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మపై దాడి చేశారనే బాధతోనే ఈ పని చేశానని తెలిపాడు. పోలీసులు అతడిని గాంధీకి తరలించారు.