హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి

NTR: కంచికచర్ల మండలం పరిటాలలోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామానికి చెందిన యువకుడు తీవ్రంగా గాయపడి ఆంధ్ర హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్నాడు. పెట్రోల్ బంక్ యాజమాన్యం స్పందించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.