హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా..!

KDP: చెన్నూరుకు చెందిన కాటం వీరబ్రహ్మయ్య గతంలో రూ.లక్ష పూచీకత్తుతో బైండోవర్ అయ్యాడు. నిబంధనలు ఉల్లంఘించి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ రెండు కేసుల్లో పట్టుబడ్డాడు. MRO విజయకుమారి నోటీసులను బేఖాతరు చేసి బాండ్ డబ్బులు చెల్లించకపోవడంతో సీఐ చాంద్‌బాషా నివేదిక మేరకు తహశీల్దార్ 14 రోజుల రిమాండ్ విధించారు. అతడిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.