AKP: జిల్లాలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు DIEO మద్దిలి వినోద్‌బాబు మంగళవారం తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు అడ్మిషన్లు పొందవచ్చన్నారు. ఇక గడువు పొడిగింపు ఉండదని, ఇదే చివరి అవకాశమని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఇంటర్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు


