హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం ధర్నా

JGL: ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట బీసీ సంఘాలు భారీ ధర్నా నిర్వహించాయి. 30 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.14 వేల కోట్లు బకాయి ఉందని, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఉన్నత చదువులు, ఉద్యోగాలకు దూరమవుతున్నారని అన్నారు.