హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్‌పై మహిళ ఫిర్యాదు.. కేసు నమోదు

ASF: బెజ్జుర్ మండలం, తుమ్మలగూడ గ్రామ సర్పంచ్ కొండా రాంప్రసాద్ పై ఓ మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి స్నానం చేస్తున్న సమయంలో సదరు సర్పంచ్ చాటు మార్గంలో సెల్ఫోన్లో వీడియో తీసే ప్రయత్నం చేయగా మహిళా ఉద్యోగి పోలీసులకు సమాచారమిచ్చింది. పోలీసులు విచారణ జరిపి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసునమోదు చేశారు.