హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంగళ గౌరీ దేవిగా ఎల్లమ్మ తల్లి దర్శనం

NLG: కనకల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా అమ్మవారు శ్రీ మంగళ గౌరీ దేవిగా భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచార్య ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక నిజ అభిషేకం, విశేష అలంకరణ ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.