హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విగ్రహాల తరలింపులో అప్రమత్తత అవసరం'

SRPT: వినాయక విగ్రహాలను మండపాలకు తరలించే సమయంలో నిర్వాహకులు, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ విగ్రహాలకు అనుగుణంగా సురక్షిత మార్గాన్ని ముందుగానే ఎంపిక చేసుకోవాలని, విద్యుత్‌ తీగలు, కేబుళ్లను పరిశీలించాలని తెలిపారు. సామర్థ్యమున్న వాహనాలు, అనుభవజ్ఞులైన డ్రైవర్లను ఉపయోగించాలని, ట్రాఫిక్‌ రద్దీ వేళ తరలించొద్దని సూచించారు.