హైదరాబాద్: 28°C
తెలంగాణ

విహెచ్పి ధన్వాడ ప్రఖండ అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్

NRPT: ధన్వాడ, మరికల్, నర్వ మండలాల విహెచ్పి ప్రఖండ అధ్యక్షులుగా శ్రీనివాస్ గౌడ్‌ను సోమవారం రాత్రి ఎన్నుకున్నారు. కార్యదర్శిగా సత్యనారాయణ, బజరంగ్దళ్ ప్రఖండ్ అధ్యక్షులుగా వీరేష్ గౌర్లను ఎన్నుకున్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా కార్యదర్శి శివకుమార్, నారాయణ, బాలకృష్ణయ్య, అశ్విని నర్సింలు, సుంకూర్ నరసింహులు పాల్గొన్నారు.