హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు

HYD: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు పై కేసు నమోదైంది. దీంతో హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని ఆయన నివాసానికి మంగళవారం భారీగా పోలీసులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హరీష్ రావు ఇంటి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకోవడంతో నానక్‌రామ్ గూడ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.