హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాలివాన బీభత్సం.. తప్పిన పెను ప్రమాదం

BPT: జిల్లాలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి 216ఏ జాతీయ రహదారిపై NHAI భారీ సూచిక బోర్డు విరిగిపడింది. ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనివల్ల బైపాస్‌లో ఒకవైపే రాకపోకలు సాగుతున్నాయి. పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.