హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్కాపూర్‌లో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు

VKB: తాండూరు మండలంలోని మల్కాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రాన్ని నిన్న ప్రారంభించారు. విద్యార్థుల ఆధార్ నమోదు, మొబైల్ నంబర్ అనుసంధానం, చేతి వేళ్లు, కనుగుడ్ల అప్ డేట్, చిరునామాలో మార్పులు, తప్పుల సవరణ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉపసర్పంచ్ జగదీశ్ గౌడ్, ప్రధానోపాధ్యాయుడు బాబ్యానాయక్ సూచించారు.