హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్వారీ పనులు నిలిపివేతకు ఆదేశాలు

NGKL: వెల్దండ మండలంలోని శశిపాల్‌రెడ్డి స్టోన్‌ అండ్‌ మెటల్‌ క్వారీపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు చేపట్టారు. బ్లాస్టింగ్‌ కార్యకలాపాలతో ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, వ్యవసాయ పొలాల్లో రాళ్లు పడుతున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేకుండా, నిబంధనలు ఉల్లంఘిస్తూ క్వారీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.