SDPT: నషా ముక్త్ యువ జాతీయ పోటీల్లో లకుడారం సర్పంచ్ చిక్కుడు శిల్పా నర్సింలు దేశంలోనే ద్వితీయ స్థానం సాధించి కుకునూరుపల్లి మండల కీర్తిని చాటారు. సంవాద్ సంస్థ ఆమెకు రూ.20 వేల నగదు బహుమతిని అందజేసి సత్కరించింది. నేటి బాలలే రేపటి పౌరులని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి నవసమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని శిల్ప కోరారు.
తెలంగాణ
జాతీయ స్థాయిలో లకుడారం సర్పంచ్‌కు ప్రతిభ


