కోనసీమ: సీఎం చంద్రబాబు నాయుడు రేపు అంబాజీపేట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.30 గంటలకు ఇరుసుమండ లేఔట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తారు. పార్టీ నేతలతో సమావేశమవుతారు. కార్యక్రమాల అనంతరం సాయంత్రం 4.55 గంటలకు ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రేపటి సీఎం షెడ్యూల్ ఇదే..!


