BHPL: శాసనసభ స్పీకర్‌పై BRS MLC తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గణపురం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు తాళ్లపెళ్లి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. తాతా మధును శాసన మండలి నుంచి బర్తరఫ్ చేయాలని, కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'తాతా మధును తక్షణమే బర్తరఫ్ చేయాలి'


