హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిమ్స్ లో వృధాగా సిమెంట్ బల్లలు

ADB: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో సందర్శకుల కోసం కూర్చోడానికి ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలు పర్యవేక్షణ లేక వృధాగా ఉన్నాయి. బల్లల కింద సిమెంట్ గద్దెలు ఏర్పాటు చేయకపోవడంతో అవి ఉపయోగంలో లేకుండా పోయాయి. వెంటనే రిమ్స్ అధికారులు బల్లల కింద సిమెంట్ గద్దెలను ఏర్పాటు చేసి కూర్చోవడానికి వీలుగా తయారు చేయాలని ప్రజలు కోరుతున్నారు.