హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగుల మందు తాగి రైతు మృతి

NLG: పత్తి పంట ఎండిపోవడంతో మనస్తాపానికి గురైన రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చండూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంగడిపేట గ్రామానికి చెందిన రాములు సోమవారం పొలానికి వెళ్లి, పంట పూర్తిగా ఎండిపోవడంతో పెట్టుబడి నష్టం తప్పదని ఆవేదనకు గురై పొలంలోనే పురుగుల మందు తాగి మృతి చెందినట్లు తెలిపారు.