హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు

WGL: శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా వరంగల్‌లోని చారిత్రక శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.