ASF: తిర్యాణి మండలంలో అడవి జంతువుల వీరంగంతో జనం బెంబేలెత్తుతున్నారు. అడవి పందులు, ఎలుగుబంట్ల దాడులతో రైతులు, గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శివారు గ్రామాలలో అడవి పందుల గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న ఎలుగుబంటి దాడి, నిన్న అడవి పంది దాడితో ప్రజల్లో భయం మరింత పెరిగిందని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
అడవి జంతువుల వీరంగంతో జనం బెంబేలు


