హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవి పంది బీభత్సం.. యువకుడిపై దాడి

NRML: తిర్యాణి మండలంలోని రొంపల్లి గ్రామపంచాయతీకి చెందిన కుడిమేత దిలీప్ అనే యువకుడిపై అడవిపంది దాడిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం పత్తి చేనులో పనిచేస్తుండగా ఒక్కసారిగా పందుల గుంపు ఆయనపై దాడిచేశాయన్నారు. కేకలు విన్న కూలీలు వచ్చి వాటిని తరిమివేశారు. కుడికాలికి గాయం కాగా, తిర్యాణి సీహెచ్ సీలో ప్రథమ చికిత్స అనంతరం మంచిర్యాల తరలించినట్లు వైద్యాధికారి కృష్ణ తెలిపారు.