హన్మకొండ నగరంలోని బాలసముద్రంలోని మున్సిపల్ డంపింగ్ యార్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. మంగళవారం డంపింగ్ యార్డులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
డంపింగ్ యార్డులో మృతదేహం లభ్యం


