BDK: ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా తల్లిని బెదిరింపులకు దిగిన ఘటనలో మనస్తాపం చెందిన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దమ్మపేట మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కొణిజర్ల మండలం తీగలబంజరకు చెందిన బానోతు హుస్సేన్‌పై పోలీసులు అరెస్ట్ చేసారు.
తెలంగాణ
ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం


