WNP: అమరచింత పాత ఎస్సీ కాలనీలోని ఇంటి స్థలాన్ని కాపాడాలని బాధితులు కృపమ్మ, నవీన కోరారు. సర్వే నంబర్ 56లోని ప్లాట్లను 85 తమ తండ్రి ఆగు ఏబు పేరుతో గతంలో కేటాయించారని తెలిపారు. ఈ స్థలానికి గ్రామపంచాయతీ, ప్రస్తుత మున్సిపల్ రసీదులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం రసీదులు చెల్లవంటూ రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'ఎస్సీ కాలనీలోని ఇంటి స్థలాన్ని కాపాడండి'


