హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశా వర్కర్ల ముందస్తు అరెస్టు

WGL: జీతాల పెంపు, హెల్త్‌ కార్డుల కోసం హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో నిర్వహించిన ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మండల అధ్యక్షురాలు పోలపల్లి అన్నపూర్ణతో పాటు పలువురిని అరెస్టు చేశారు. శాంతియుతంగా ధర్నాకు వెళ్తుండగా అరెస్టు చేయడం సరికాదని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు.