హైదరాబాద్: 28°C
తెలంగాణ

కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా విష్ణువర్ధన్ రెడ్డి

WNP: ఆత్మకూరు మండలం మూలమల్లకు చెందిన బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి నారాయణపేట జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.