హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు: మంత్రి తుమ్మల

KMM: సాగర్ ఆయకట్టు పంటలకు నీటి కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల విజ్ఞప్తి మేరకు వైరా, లంకసాగర్ పరిధిలోని పంటలకు గోదావరి జలాలను విడుదల చేయించామని, ఈ సాగునీటి విడుదలపై సోమవారం ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌తో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించినట్లు వెల్లడించారు. రైతులకు మేలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని మంత్రి అన్నారు.