హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ధర్మవరానికి మాజీ DRDO ఛైర్మన్ రాక

సత్యసాయి: మాజీ DRDO ఛైర్మన్, ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారు జి.సతీష్ రెడ్డి మంగళవారం ధర్మవరం రానున్నారు. స్థానిక సీఎన్‌బీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.